
HIT ప్రీ రిలీజ్ బిజినెస్
హిట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ సినిమా బడ్జెట్‌కు తగినట్టుగానే జరిగింది. నైజాం థియేట్రికల్ హక్కులు రూ.1.4 కోట్లు, సీడెడ్‌లో రూ.40 లక్షలు, ఆంధ్రాలో రూ.1.80 కోట్లు మేరకు అమ్ముడుపోయాయి. దీంతో ఏపీ, తెలంగాణలో ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.3.60 కోట్లు పలికింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.20 లక్షలు, ఓవర్సీస్లో రూ.60 లక్షలతో వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.4.40 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

తొలి రోజు ఆక్యుపెన్సీ
టీజర్లు, ట్రైలర్లకు క్రేజ్ రావడంతో హిట్ చిత్రం మిడిల్ రేంజ్ టార్గెట్ అంటే రూ.5 కోట్ల లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు యూత్ నుంచి రెస్పాన్స్ బాగానే ఉండగా.. బీ, సీ సెంటర్లలో 30శాతానికి అటు ఇటుగా ఆక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఏపీ, తెలంగాణలో వసూళ్లు
విశ్వక్ సేన్ రెంజ్‌ను బట్టి చూస్తే తొలి రోజున ఏపీ, తెలంగాణలో వసూళ్లు ఓ మాదిరిగా కనిపించాయి. ఈ చిత్రం మొదటిరోజున తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. కోటికిపైగా వసూలు చేసింది. తొలి రోజున పాజిటివ్ టాక్ కొంత కనిపించడంతో రెండో రోజున సినిమా కలెక్షన్లు పెరగడానికి అవకాశాలు లేకపోలేదు.

ఏపీ, తెలంగాణలో ఏరియాల వారీగా చూసుకొంటే
నైజాంలో రూ.67 లక్షలు
సీడెడ్‌లో రూ.13 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.12 లక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.7 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 లక్షలు
గుంటూరులో రూ.15.6 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.8 లక్షలు
నెల్లూరులో రూ. 3.5 లక్షలు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1.32 కోట్లు రాబట్టింది.

యూఎస్ బాక్సాఫీస్ రిపోర్టు
ఇక ఓవర్సీస్ కలెక్షన్లు చూస్తే.. భారీగానే కనిపిస్తున్నాయి. నాని నిర్మాత కావడం, విశ్వక్ సేన్ తొలి సినిమాకు మంచి ప్రజాదరణ దక్కడంతో యూఎస్‌లో ఓపెనింగ్స్ సానుకూలంగా కనిపించాయి. అమెరికాలో ఈ చిత్రం తొలి రోజున రూ.1.2 కోట్లకుపైగానే రాబట్టినట్టు తెలుస్తున్నది.