బిగ్‌బాస్ నుంచి దివి వద్మా అవుట్.. సమంత ఎమోషనల్‌.. కంటతడితో.. | Divi Vadthya eliminated from Bigg Boss Telugu 4, Samantha akkineni gets emotional

0
42


లాస్య కోసం స్వయంగా నామినేషన్

లాస్య కోసం స్వయంగా నామినేషన్

బిగ్‌బాస్ ఇంటిలో ఏడో వారం ఎలిమినేషన్‌ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో లాస్య, దివి మధ్య చర్చ జరిగింది. లాస్య కోసం దివి వద్యా స్వయంగా నామినేట్ చేసుకొన్నారు. దాంతో ఆమె మరోసారి దివి ఎలిమినేషన్ పరీక్షను ఎదుర్కొవాల్సి వచ్చింది.

అవినాష్, దివికి కఠిన పరీక్ష

అవినాష్, దివికి కఠిన పరీక్ష

ఇక దసరా సందర్భంగా జరిగిన స్పెషల్ ఎపిసోడ్‌లో సమంత అక్కినేని ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇంటిలోని సభ్యులను ఆటపాటలతో ఆనందంలో ముంచుతూ.. అరియానా, మోనల్, అభిజిత్, నోయల్ సేవ్ చేశారు. చివరకు అవినాష్, దివి వద్యా మిగిలారు. దాంతో వారిద్దరికి కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.

దివి ఎలిమినేషన్ అలా..

దివి ఎలిమినేషన్ అలా..

అవినాష్‌ను, దివిని తమకు కేటాయించిన స్థానాల్లోకి వెళ్లి నిలుచోవాలని సమంత సూచించారు. నామినేషన్ ప్రక్రియలో పాటించిన రంగు బకెట్ల విధానంతో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఒక బకెట్ గ్రీన్ పేపర్ పూలు ఉంటాయి. మరో బకెట్ ఎరుపు కాగితపు పూలు ఉంటాయి. ఎరుపు కాగితాలు ఎవరిపై పడుతాయో వారు ఎలిమినేట్ అవుతారని ఎలిమినేషన్ రూల్ చెప్పారు. బకెట్ తాడు లాగగా దివిపై ఎరుపు కాగితాలు పడటంతో ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.

అమ్మా రాజశేఖర్ కంటతడి

అమ్మా రాజశేఖర్ కంటతడి

దివి ఎలిమినేషన్‌తో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. అమ్మా రాజశేఖర్ కంటతడి పెట్టారు. మిగితా సభ్యులందరూ ఎమోషనల్ అయ్యారు. దివితో ఇంటి సభ్యులు సెల్పీ దిగి.. వేదికపై ఉన్న సమంత వద్దకు పంపించారు. దివిని హీరో కార్తికేయ సాదరంగా ఆహ్వానించారు.

దివి ఎలిమినేషన్‌తో సమంత ఎమోషనల్

దివి ఎలిమినేషన్‌తో సమంత ఎమోషనల్

హోస్ట్ సమంతతో జతకలిసిన తర్వాత దివిని ఓదార్చే ప్రయత్నం చేశారు. దసరా పండగ రోజున ఎలిమినేట్ కావడం బాధగా ఉందా అంటే అలాంటిదేమీ లేదు. నాకు హ్యాపీగానే ఉంది అంటూ దివి చెప్పారు. ఆ తర్వాత ఇంటిలోని లాస్యపై దివి బిగ్‌బాంబ్ వేశారు. బిగ్‌బాంబ్ ప్రకారం వారం రోజులపాటు వంట చేయాల్సి ఉంటుంది. లాస్యకు అభిజిత్ సహయం అందించాలని సమంత సూచించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here