దారుణంగా భాగీ 3 కలెక్షన్లు.. జేమ్స్‌బాండ్ కనికరించినా.. కరోనా దెబ్బతో.. | Baaghi 3 movie day 1 collections: Tiger Shroff managed to get the good numbers

0
61


రికార్డుస్థాయిలో రిలీజ్

రికార్డుస్థాయిలో రిలీజ్

భాగీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజైంది. భారత్‌లో 4500 థియేటర్లలో, ఓవర్సీస్‌లో 1100 థియేటర్లలో కలిపి ప్రపంచవ్యాప్తంగా 5600 థియేటర్లలో రిలీజైంది. భారీ ఎత్తున్న ఎక్కువ సంఖ్యలో సినిమా రిలీజ్ కావడం టైగర్ ష్రాఫ్ కెరీర్‌లోనే అత్యధికమని ట్రేడ్ అనలిస్టు పేర్కొన్నారు.

జేమ్స్‌బాండ్ కనికరించినా..

జేమ్స్‌బాండ్ కనికరించినా..

ఇక జేమ్స్‌బాండ్ సిరీస్‌లో డేనియల్ క్రేగ్ నటించిన నో టైమ్ టు డై సినిమా రిలీజ్ కూడా వాయిదా పడటం భాగీ సినిమాకు కలిసి వచ్చింది. ఒకవేళ జేమ్స్‌బాండ్ మూవీ రిలీజ్ అయి ఉంటే కలెక్షన్లలో భారీగా కోతపడే అవకాశం ఉండేది. ఏడు నెలలపాటు సినిమాను వాయిదా వేయడంతో కొన్సి సినిమాల పరిస్థితి మెరుగుపడింది.

జాకీష్రాఫ్‌తో టైగర్ ష్రాఫ్

జాకీష్రాఫ్‌తో టైగర్ ష్రాఫ్

ఇక భాగీ 3 ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించడానికి ఓ ప్రత్యేకత ఉంది. టైగర్ ష్రాఫ్ తన తండ్రి, వెటరన్ యాక్టర్ జాకీ ష్రాఫ్‌తో కలిసి నటించడం ఓ విశేషం. జాకీ ష్రాఫ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఓ పండగలా మారిందనే సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. ఇంకా ఈచిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్, అంకితా లోఖండే తదితరులు నటించారు.

భాగీ 2 మాత్రమే టాప్

భాగీ 2 మాత్రమే టాప్

భాగీ సిరీస్‌లో టైగర్ ష్రాప్ నటించిన భాగీ 3 చిత్రం కరోనా వైరస్ ప్రభావం కొంత పడినట్టు కనిపించింది. భాగీ 1 చిత్రం తొలి రోజున రూ.12 కోట్లు వసూలు చేస్తే.. భాగీ 2 చిత్రం రూ.25.10 కోట్లు రాబట్టింది. తాజాగా భాగీ చిత్రం రూ.17.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

Deesha Patani Calls Tiger Sharoff As “Brother” | Filmibeat Telugu

2020లో టాప్‌గా భాగీ 3

ఇక 2020 రిలీజ్ అయిన సినిమాలను పరిశీలిస్తే.. భాగీ 3 మూవీ మెరుగైన వసూళ్లను నమోదు చేసింది. భాగీ 3 రూ.17.50 కోట్లు వసూలు చేస్తే, తానాజీ రూ.15.10 కోట్లు, లవ్ ఆజ్ కల్ రూ.12.40 కోట్లు, స్ట్రీట్ డ్యాన్సర్ రూ.10.26 కోట్లు, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ రూ.9.55 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here