చనిపోయే ముందు పార్టీలో మునిగి తేలిన దిశ సలియాన్ .. సంచలన వీడియో లీక్ | Disha Salian Dance Video Goes Viral Before Death

0
61


 దిశ మరణంపై..

దిశ మరణంపై..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశ జూన్ 9న 14వ అంతస్థు మీద నుంచి జారి పడిపోయి మరణించిందని తెలిసిందే. అయితే ఇది ప్రమాదవశాత్తు జరగలేదని, దీని వెనుక చాలాపెద్ద కథ ఉందని, సూరజ్ పంచోలి వంటి వారి పేర్లు మీడియాలో వచ్చాయి. దిశను రేప్ చేసి, అత్యంత క్రూరంగా చంపారని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

వీడియో లీక్..

వీడియో లీక్..

అయితే తాజాగా సంచలన వీడియో బయటకు వచ్చింది. చనిపోయే ముందు క్షణం వరకు దిశ ఎంతగా ఎంజాయ్ చేసిందో వీడియోలో కనిపిస్తోంది. దిశ తనకు కాబోయే భర్త, అతి దగ్గరి సన్నిహితులతో పార్టీలో మునిగితేలింది. ఈ క్రమంలో దిశ ఎంతో సంతోషంగా ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను స్వయంగా దిశాయే తీసి.. తన ఫ్రెండ్స్ వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేసినట్టుగా తెలుస్తోంది.

 రూమర్లపై ఆవేదన..

రూమర్లపై ఆవేదన..

దిశా సలియాన్ మరణంపై అల్లిన కథనాల పట్ల ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘మా కూతురిపై దుష్ప్రచారం చేసి మీ మైలేజ్ పెంచుకోండి.. ఆమెతో ఆడుకోకండి. ఆమె మాకు ఒక్కగానొక్క కూతురు. మేము మా కూతురిని కోల్పోయాం. కానీ మీరు ఆమె పరువును తీసేస్తున్నారు.

రేప్ జరగలేదు, గర్భవతి కాలేదు..

రేప్ జరగలేదు, గర్భవతి కాలేదు..

చనిపోయినా సరే ఆమెను చెడుగా చిత్రీకరిస్తున్నారు.. మమ్మల్ని కూడా బ్యాడ్ చేస్తున్నారు. ఇలా కించపరిచి మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. మీడియాకు ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఉన్నట్టే మాకు కూడా వ్యక్తిగత హక్కు ఉంటుంది. మా జీవితాల్లోకి జోక్యం చేసుకోకండి. మీ అందర్నీ వేడుకుంటున్నాను. పోలీసులు మాకంతా వివరించారు. సాక్ష్యాధారాలు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూపించారు. మా కూతురు గర్భవతి కాదు.. రేప్‌కు గురి కాలేదు.. శరీర భాగాలన్నీ బాగానే ఉన్నాయ’ని స్పష్టం చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here