ఐశ్వర్యరాయ్ మాజీ మేనేజర్ సూసైడ్.. 14 అంతస్తుల భవనం నుంచి దూకి.. | Aishwarya Rai Bachchan ex manager Disha Salian commits suicide

0
49


ముంబైలోని మలాడ్‌లో ఘటన

ముంబైలోని మలాడ్‌లో ఘటన

తాజా వార్తల ప్రకారం.. దిశ ముంబైలోని మలాడ్‌లోని 14 అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోన్నారు. ఆమెను స్థానిక బోరివాలి హస్పిటల్‌కు వెంటనే తరలించారు. అయితే అప్పటికీ ఆమె మరణించారని వైద్యులు ధృవీకరించారు. దాంతో ఆమె జీవితం విషాదంగా మిగిలింది.

కాబోయే భర్తతో కలిసి

కాబోయే భర్తతో కలిసి

దిశా సలియాన్ ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె ఆత్మహత్య చేసుకొన్న సమయంలో కాబోయే భర్త వెంట ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ఆత్మహత్యా ఘటన తర్వాత దిశ తల్లిదండ్రుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకొన్నారు. ఆతర్వాత కాబోయే భర్త నుంచి వివరాలు సేకరించి ఆయన వెర్షన్‌ను కూడా రికార్డు చేసినట్టు తెలిసింది.

పీఆర్వోగా కెరీర్ ప్రారంభించి

పీఆర్వోగా కెరీర్ ప్రారంభించి

దిశ తన కెరీర్‌ను పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా ప్రారంభించింది. ఆ తర్వాత సెలబ్రిటీ టాలెంట్ మేనేజర్‌గా మారారు. ముంబైలో ఆమె నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా బంటీ సజ్‌దే కార్నర్ స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్‌తో కొనసాగుతున్నారు.

ఐశ్వర్యరాయ్, సుశాంత్ సింగ్‌కు మేనేజర్‌గా

ఐశ్వర్యరాయ్, సుశాంత్ సింగ్‌కు మేనేజర్‌గా

గతంలో పలువురు సినీ సెలబ్రిటీలకు దిశ మేనేజర్‌గా పనిచేశారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, సుశాంత్ సింగ్, కమెడియన్ భారతీ శర్మ, హీరోయిన్ రియా చక్రవర్తి, యాక్టర్ వరుణ్ శర్మకు మేనేజర్‌గా పనిచేశారు. అంతేకాకుండా పీఆర్వోగా పలు సినిమాలకు సహాయ సహకారాలు అందించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here